
గిద్దలూరు: నులిపురుగుల నివారణకు మందులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని సోమవారం పాఠశాలల్లో అధికారులు విద్యార్థులకు మందులను పంపిణీ చేశారు. నులిపురుగుల నివారణ కొరకు విద్యార్థులకు మందులను వేశారు. మందులు వేశాక నులిపురుగుల నివారణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా అధికారులు తెలిపారు.