ఒంగోలు: రూ. 143 కోట్లతో వసతి గృహాలు మరమ్మత్తులు

55చూసినవారు
ఒంగోలు నగరంలో రూ. 6. 15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సి బాలికల నూతన వసతి గృహానికి బుధవారం రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ. 30 కోట్ల వ్యయంతో విద్యార్థుల కోసం వసతి గృహాలను నిర్మిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత వసతి గృహాన్ని రూ. 6 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వసతి గృహాలను రూ. 143 కోట్ల వ్యయంతో మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్