ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఒంగోలు నగరంలోని హర్షిని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భావన (17) గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.