ముండ్లమూరు మండలంలోని వివిధ గ్రామాలలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ భూ దినోత్సవం, గ్రామస్థాయి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ భూమి సారాన్ని పెంచడానికి రైతు పచ్చి రొట్టె పంటలు, పంటల మార్పు వంటివి తప్పకుండా చేపట్టాలని కోరారు. ప్రతి ఏటా భూమిలో సేంద్రీయ కార్బన్ తగ్గుతుందని, దానివలన భూమిలో నీటిని నిల్వ ఉంచితే సామర్థ్యం తగ్గుతుందన్నారు.