దొనకొండ మండలం బాధాపురం ఎస్సీ కాలనీ తీవ్ర తాగునీటి ఇబ్బందులతో ఎదుర్కొంటోంది. గతంలో బోరు, ట్యాంకర్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలకు ఉపయోగపడలేదు. 45 కుటుంబాలకు ఒకే చేతిపంపు ఆధారమైంది. సాగర్ నీళ్లు 15 రోజులు నుంచి రాకపోవడంతో పరిస్థితి మరింత కష్టంగా మారింది. సరైన రోడ్డు వసతుల మించిన సమస్యలపై అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.