వెలిగండ్ల మండలంలోని గుడిపాటి పల్లి గ్రామంలో గురువారం పేకాట స్థావరం పైన స్థానిక ఎస్సై మధుసూదన్ రావు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 5, 370 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మధుసూదన్ రావు మాట్లాడుతూ పేకాటలో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లుగా తెలిపారు.