దేవాదాయ శాఖ మంత్రి ఆ నం రామనారాయణరెడ్డి అధ్యక్షతన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో బుధవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు. కనిగిరి నియోజకవర్గంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఉగ్ర సమావేశంలో మంత్రికి వివరించారు. భైరవకోన, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంతో పాటు కనిగిరి ప్రాంతంలోని ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.