మర్రిపూడి: కోడిపందాలు ఆడుతున్న పదిమంది అరెస్ట్

60చూసినవారు
మర్రిపూడి: కోడిపందాలు ఆడుతున్న పదిమంది అరెస్ట్
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జువిగుంటలో ఆదివారం కోడిపందాలు ఆడుతున్న పదిమందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి నాలుగు కోళ్లు రూ. 6, 500 నగదులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కోడి పందాలు ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేశామని మర్రిపూడి ఎస్సై వెల్లడించారు. పేకాట, మట్కా, కోడి పందాలు ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు అన్నారు.

సంబంధిత పోస్ట్