సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో మూడు రోజుల క్రితం సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందారు. ఒకరు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన మృతదేహం కోసం పోలీసులు 2 రోజుల పాటు శ్రమించి శుక్రవారం మృతదేహాన్ని వెలికి తీశారు. స్థానిక జాలర్లు ఆ సమయంలో సుడిగుండాలు ఏర్పడడం వల్లే వీరి మృతికి కారణమని శనివారం తెలిపారు. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు ఇక్కడ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.