పొలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి

59చూసినవారు
పొలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి
పొలంలో పని చేస్తూ విద్యుత్ షాక్ కు గురై ఓ రైతు మృతి చెందిన విషాద సంఘటన మార్కాపురం మండలం భూపతి పల్లి గ్రామంలో జరిగింది. గురువారం సుబ్బారెడ్డి పొలంలో పనిచేస్తున్న సమయంలో విద్యుత్ తీగ తెగి క్రిందపడింది. ఈ విషయాన్ని గుర్తించని రైతు విద్యుత్ ను తీగను తాకాడు. ఒక్కసారిగా రైతు కుప్పకూలి మృతి చెందాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్