ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో 2, 549 మంది నిరుద్యోగులకు వివిధ ప్రముఖ కంపెనీల నుంచి ఉద్యోగాలు పొందారు. మరో 150-200 మందికి వారం రోజుల్లో మరి కొన్ని కంపెనీల నుంచి ఆఫర్ లెటర్లు ఇస్తారని రాఘవరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన వారికి రాఘవరెడ్డి నియామక పత్రాలు అందజేశారు.