ప్రకాశం జిల్లా మార్కాపురంలో రైతుల కూలీల కోసం సీఐ సుబ్బారావు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూలీల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి కూలీల కోసం సిఐ సుబ్బారావు బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం ఆర్టీసీ బస్సులో కూలీలను వారు పని చేస్తున్న పొలాల వద్దకు చేర్చారు. దీంతో రైతు కూలీలు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.