త్రిపురాంతకం: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

60చూసినవారు
త్రిపురాంతకం: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ హస్సాన్ ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు రౌడీషీటర్లను పిలిపించి బుద్ధిగా మసులుకోవాలని వారికి సీఐ సూచనలు, సలహాలు ఇచ్చారు. నేర ప్రవృత్తి వీడి సమాజంలో మంచిగా బతకాలని హితవు పలికారు. చట్ట విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నిరంతరం రౌడీషీటర్ల పై నిఘ ఉంటుందని సీఐ వారిని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్