విజయవాడ వరద బాధితులకు పలు ఉద్యోగ సంస్థలు వారి ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేసిన విషయం తెలిసిందే. అదే కోవలో అపస్మా ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గం లోని 14 ప్రైవేట్ పాఠశాలలు కలిసి రూ. 8, 43, 310 విరాళం ఇచ్చారు. ఈ విరాళాలను పాఠశాలల కరక్పాండెంట్లు, ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా ఇచ్చారని తెలిపారు. ఈ మొత్తం సీఎం సహాయనిదికి పంపుతున్నట్లు గురువారం తెలిపారు.