జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులను నిబంధనల మేరకు సకాలంలో మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లోని శంకరన్‌హాలులో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పిఎంఈజిపి రుణాల మంజూరు, క్లస్టర్ డెవలప్‌మెంటు ప్రోగ్రాం మొదలైన అంశాలను పరిశీలించారు.