కర్నూలు జిల్లాలో విషాదం.. బాలుడు ఆత్మహత్య
భవన నిర్మాణ రంగంలో బరువైన పనులు చేయలేక ఆదోని మండలం పెద్దతుంబలంకు చెందిన శివ (14) అనే బాలుడు శుక్రవారం అనంతపురంలోని ఒక గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం 2 పట్టణ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపిన మేరకు పెద్దతుంబలంకు చెందిన కురబ అయ్యన్నకు కుమారుడు శివ (14)ను చదువులకు స్వస్తి చెప్పించి, తన అన్న నాగ్రేందతో పాటు సెంట్రింగ్ పనుల్లో పెట్టాడు. పనులు చేయలేక శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు.