ఆదోని: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య
ఆదోని డివిజన్ పరిధిలోని కుప్పగల్-కోసిగి ఆర్ఎస్ మధ్యలో గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కిలోమీటరు నంబరు 521/17 -19 పరిధిలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. తీవ్రమైన రక్త గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.