పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను అనంత జిల్లా ఎస్పీ పి. జగదీశ్ సోమవారం ఆదేశించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ అధికలోడ్ తో వెళ్లడం సురక్షితం కాదన్నారు. ఈ విషయాన్ని డ్రైవర్లు, ప్రయాణికులు గుర్తించి ఓవర్లోడింగ్ కు స్వస్తి పలకాలని కోరారు. ఓవర్ లోడ్ తో వెళ్లే ఆటోల్లో ప్రయాణించే ముందు క్షణం ఆలోచించి అందుకు దూరంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.