
కదిరి: గోవులను గోశాలకు తరలించాలని వినతి
కదిరిలో గోశాల ఏర్పాటు చేసి గోవులను గోశాలకు తరలించాలని కోరుతూ సోమవారం హిందూ ధార్మిక సంస్థలు కదిరి ఆర్డీవో వీవీ సన్యాసి శర్మకు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా హిందూ ధార్మిక సంస్థలకు చెందిన పలువురు మాట్లాడుతూ శ్రీవారి భక్తులు మొక్కు బడిగా గోవులను దానంగా వదిలి వెళ్ళడం జరుగుతోందన్నారు. గోవులను ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలకు గురువుతున్నాయన్నారు.