సోమందేపల్లి: అయ్యప్ప సన్నిధిలో మంత్రి సవిత

73చూసినవారు
సోమందేపల్లి: అయ్యప్ప సన్నిధిలో మంత్రి సవిత
సోమందేపల్లి మండల కేంద్రంలోని శివానగర్లో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం నిర్వహించిన గంగ పూజ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఎన్నో నియమ నిబంధనలతో 40 రోజులు అయ్యప్ప స్వాములు చేసే దీక్ష ఎంతో పవిత్రమైనదని అన్నారు. అయ్యప్ప సన్నిధిలో గంగ పూజకు హాజరవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం మంత్రి సవితకు అయ్యప్ప స్వాములు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్