మెళియాపుట్టి మండల కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం మెళియాపుట్టి తహశీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. గిరిజన సంఘం గౌరవ అధ్యక్షుడు పి. ప్రసాదరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సి. హెచ్. అమ్మన్నాయుడు మాట్లాడుతూ. గిరిజనులు సాగు చేస్తున్న పోడుభూములకు పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వాలని, గిరిజన గ్రామాలను సమగ్రాభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.