పాతపట్నం: జ్ఞాన మార్గం ద్వారా మానసిక ప్రశాంతత
జ్ఞాన మార్గం ద్వారా మానవునికి మానసిక ప్రశాంతత నెలకొంటుందని బెంగుళూరు కు చెందిన రాజయోగి, మోటివేషన్ స్పీకర్ మంజునాథ్ తెలిపారు.శనివారం లక్ష్మీ నర్సు పేట గ్రామంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యందు దసరా మహోత్సవాలు సందర్భంగా స్థానిక బ్రహ్మ కుమారి జీవన జ్యోతి ఆధ్వర్యంలో పరివార సదస్సు నిర్వహించారు. మంజునాథ్ మాట్లాడుతూ ఒత్తిడి లేని జీవితం సంతోషకరమైన అనుభవం కోసం రాజయోగ అభ్యాసం చేయాలని సూచించారు.