ప్రతి ఒక్కరూ సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలి
సమతుల్యమైన పౌష్టికాహారం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మండల టిడిపి యువ నాయకులు అంపిలి. పోలినాయుడు అన్నారు. బుధవారం లక్ష్మీనర్సుపేట మండలంలోని బొత్తాడసింగి అంగన్వాడీ కేంద్రం వద్ద పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలినాయుడు మాట్లాడుతూ గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు ప్రతిరోజు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని అందించడానికి అంగన్వాడీ కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని అన్నారు.