అనారోగ్య కారణంగా మృతి చెందిన శ్రీకాకుళం నగర కార్పొరేషన్ 29వ వార్డు టిడిపి ఇన్చార్జ్ కోలా శ్రీనివాస్ దేవ్ పాడెను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ మోసారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో ఉన్న మృతుని స్వగృహానికి చేరుకొని పూలమాలతో పాటు టిడిపి జెండాను కప్పి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. టిడిపి అభిమానులు కుటుంబ సభ్యులు నడుమ ఆయన శవయాత్రలో పాలుపంచుకున్నారు.