మూలపేట : ఇసుక రవాణా పై కేసులు నమోదు చేస్తే చర్యలు తప్పవు
జిల్లాలో ఎక్కడినుంచైనా ఇసుక తెచ్చుకోవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మూలపేటలో మీడియాతో మాట్లాడారు. ఇసుకను తమ వాహనాలతో రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఇసుక లోడింగ్ వరకు రూ. 300 చెల్లించాల్సి ఉంటుందని, ఇసుక అందరికీ అవసరం కాబట్టి ట్రాక్టర్కు ఎంత కావాలంటే అంత తెచ్చుకోవచ్చన్నారు. ఎవరైనా కేసులు నమోదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.