
కోటబొమ్మాళి: మావోయిస్టు నేతకు మాజీ కేంద్ర మంత్రి నివాళి
కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేటకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత నంబాల కేశవరావు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర సహాయ మంత్రి డా. కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావుతో కలిసి ఆదివారం కేశవరావు ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సాంత్వన చెప్పారు.