శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలంలోని బంటుపల్లి పంచాయతీలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. కంబాలపేటకు గడ్డి కుప్పలతో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ఘటనలో గడ్డికుప్పలతో పాటు ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ చాకచక్యంగా ట్రాక్టర్ నుంచి ట్రక్కును వేరు చేసి సురక్షితంగా బయట పడ్డాడు. గ్రామస్థుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించారు.