ఇచ్ఛాపురం పట్టణ పరిధిలోని సంతపేట వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. సంతపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 బైక్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒడిశాలోని బోనసాల ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా సోంపేట ప్రాంతానికి చెందిన మరో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.