కవిటి: సహలాలపుట్టుగలో ఎమ్మెల్యే పర్యటన

66చూసినవారు
కవిటి మండలం సహలాల పుట్టుగ పంచాయతీ పరిధిలో శనివారం రోజున ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు పర్యటించారు. ఈ మేరకు గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డును అశోక్ బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి దాసరి అశోక్ బాబు, గ్రామస్థులు, ఎసిఎఫ్ సేవా సంస్థ సభ్యులు మున్నా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్