పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల పలాస జీడీ పిక్క బొమ్మ జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇటీవల ఈ జంక్షన్లో ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని స్థానికులు వాపోయారు. తరుచు ఈ జంక్షన్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.