తిరుపతి అర్బన్ మండల పరిధిలో గల రాఘవేంద్ర నగర్ లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం 5: 30 కు కాగ్రహారతి, మొదలుకొని మహా అభిషేకము, అలంకరణ హారతి, శ్రీ సాయి సత్యనారాయణ స్వామి వ్రతం, మధ్యాహ్న హారతి, అన్నదాన కార్యక్రమము, సంధ్యా హారతి, శ్రీ షిరిడి సాయిబాబా సత్ చరిత్ర పారాయణము, ఊంజల సేవ మొదలగు కార్యక్రమాలు వైభవంగా ఆలయ కమిటీ వారు నిర్వహించారు.