
చంద్రగిరి: ఏనుగు దాడిలో రైతు మృతి.. ఎమ్మెల్యే సానుభూతి
చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచెర్ల గ్రామంలో జరిగిన ఏనుగు దాడిలో రైతు సిద్దయ్య మృతికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సానుభూతి వ్యక్తం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే మృతుని స్వగృహానికి వెళ్లి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిద్దయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారాన్ని బాధిత కుటుంబానికి త్వరగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.