చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజక వర్గం కార్వేటినగరం మండలం కృష్ణాపురం జలాశయం నిండుకుండలా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు తుఫాను ప్రభావంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండింది. దీనితో గురువారం రాత్రి గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఎస్ ఆర్ పురం , కార్వేటినగరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.