నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని అల్తూరుపాడు, సోమశిల, స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులకి సంబంధించి ప్రస్తావించారు. అల్తూరుపాడు జలాశయము పనులకి సంబంధించి మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్ళారు.