కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా సీఎం చంద్రబాబు ప్రకటించడం పట్ల కురబ కార్పొరేషన్ డైరెక్టర్ రాజగోపాల్ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 90%కు పైగా కురబ కులస్తులు టీడీపీతోనే ఉన్నారని, కుప్పంలో కురబ కులస్తులకు హామీ ఇచ్చిన విధంగా కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. కనకదాస జయంతిని కుప్పంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.