కుప్పం మునిసిపల్ పరిధిలోని మోడల్ కాలనీలో డిఎస్పి పార్థసారథి పర్యవేక్షణలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో తనిఖీలు నిర్వహించి, సరైన పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. గ్రామంలో అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనుమానితులకు ఇళ్లను అద్దెకు ఇవ్వరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.