గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా నగరి సీఐ మహేశ్వర్ శుక్రవారం రాత్రి తెలిపారు. వారి వద్ద నుంచి 1500 గ్రాముల గంజాయి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం నగరి జూనియర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. గంజాయి సరఫరాదారులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను డీఎస్పీ, ఎస్పీలు అభినందించారు.