వీ. కోటలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శనివారం మండల మహిళ సమైక్య ఆధ్వర్యంలో మెగా రుణమేళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన రూ. 12.62 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు.