రొంపిచర్ల మండలంలో నిర్వహించిన ఏడు రెవెన్యూ సదస్సుల్లో 180 అర్జీలు వచ్చినట్లు ఎమ్మార్వో కిరణ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఇందులో దారి సమస్యలు, ఆన్లైన్ సమస్యలు, అడిషన్స్, రేషన్ కార్డులు కావాలని కోరుతూ ఎక్కువగా అర్జీలు వచ్చాయని అన్నారు. వచ్చిన సమస్యలను విచారించి రోజుల్లో పరిష్కరిస్తామని ఎమ్మార్వో అన్నారు. వచ్చిన ప్రతి సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.