పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం తహశీల్దార్ ఎస్. ఎం. హుస్సేన్ చిత్తూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందున, చిత్తూరు జిల్లా ముస్లిం ఐక్యవేదిక తరపున ఆయనను శనివారం సదుం తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షులు ఎస్. ఎం. రషీద్, ప్రధానకార్యదర్శి ఇనాయ్ తుల్లా తదితరులు పాల్గొన్నారు.