సత్యవేడు: పిడుగు పడి ఇద్దరి మృతి
తిరుపతి జిల్లాలో వర్షాలు విషాదాన్ని నింపాయి. సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం హనుమంతపురం ఏఏడబ్ల్యులో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈక్రమంలోనే భారీ శబ్దాలతో పిడుగులు పడ్డాయి. దీంతో పొలాల్లో పని చేసుకుంటున్న మణి(54), రాము(55) అక్కడికక్కడే చనిపోయారు. కుటుంబీకులు మృతదేహాలను ఇంటికి తరలించారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.