దుత్తలూరు: లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ప్లాంట్ నిరూపయోగంగా
నెల్లూరు జిల్లా దుత్తలూరు పట్టణంలోని ఏసీ కాలనీ వద్ద కొన్నేళ్ల క్రితం ప్రజల కోసం నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభానికి నోచుకోకుండానే నిరుపయోగంగా తయారైంది. అప్పట్లో రూ. 6. 40 లక్షల వ్యయంతో నిర్మించిన సామాజిక నీటి శుద్ధి సరఫరా కేంద్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అద్వాన పరిస్థితికి గురైంది. నిధులు వృధా కాకుండా ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని మంచినీరు అందజేయాలని స్థానికులు కోరారు.