దుత్తలూరు: దొడ్డ కొండలో వెంగమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు
జిల్లా లోని దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానములో దొడ్డ కొండ మీద వెలసియున్న శ్రీ వెంగమాంబ అమ్మవారికి సోమవారం పూజలు మొదలయ్యాయి. పూజారులు వేదమంత్రోచ్చరణతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో ఉషారాణి, ధర్మకర్తల ఆధ్వర్యంలో జరిగింది. చట్టు పక్కల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.