నూతన సంవత్సర వేడుకల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని వెంకటగిరి సీఐ ఏవీ రమణ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 'వెంకటగిరి పట్టణంతో పాటు, వెంకటగిరి రూరల్, డక్కిలి, బాలాయపల్లి మండల ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బహిరంగంగా పార్టీలు, ఇతర అశ్లీల నృత్యాలు నిర్వహించకండి. తాగి వాహనాలు నడపవద్దు. ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలని సీఐ సూచించారు.