వేప గింజల కషాయం తయారు పై రైతులుకు అవగాహన

83చూసినవారు
వేప గింజల కషాయం తయారు పై రైతులుకు అవగాహన
బొబ్బిలి మండలం పారాది గ్రామంలో శుక్రవారం వేప గింజల కషాయం తయారు చేసే విధానం అల్లాడి వెంకట్ రమణ అనే రైతు పొలంలో చేయించడం జరిగిందని ఏడిఎ మజ్జి. శ్యామ్ సుందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేప గింజల కషాయం తయారిచేయు విధానంపై అవగాహన కల్పించారు. ఐదు కేజీలు వేప గింజలు తీసుకొని వాటిని పప్పు చేసి పల్చటి గుడ్డలో కట్టి దానిని 10లీటర్ల నీటిలో 24 గంటల సేపు నానపెట్టి బాగా రసం తీసిన తర్వాత వినియోగించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్