రాష్ట్రంలో ఉన్న అందరి క్రైస్తవుల యొక్క సమస్యలు పరిష్కారానికి, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. శుక్రవారం రైల్వే జంక్షన్ సూర్య రెసిడెన్సి వద్ద సిఆర్పిఎస్, బొబ్బిలి పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్, బొబ్బిలి డివిజనల్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్, బ్లడ్ క్యాంప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.