చీపురుపల్లి: జగన్ పై ఎమ్మెల్యే వెంకటరావు ఫైర్
వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు వ్యాఖ్యానించారు. చీపురుపల్లిలో ఆయన శనివారం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడి పొరని అన్నారు. ఆయన పాలనలో ప్రజా వ్యవస్థను భ్రష్టు పట్టించారని అన్నారు. కూటమి పాలనలో ప్రజలు ఆనందంగా జీవించడం ఆయనకు ఇష్టం లేదని ఆరోపించారు. చవకబారు మాటాలు మానుకోవాలని హితవు పలికారు.