గుర్ల: మండలంలో విస్తృతంగా వాహన తనిఖీలు
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గుర్ల మండలంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై నారాయణరావు శనివారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన తన సిబ్బందితో కలిసి పలు ప్రధాన కూడళ్లలో వాన తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాహన పత్రాలు సరిగా లేని వాహనాలను సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరారు.