చీపురుపల్లి: తగ్గుముఖం పట్టిన డయేరియా: జిల్లా కలెక్టర్
గుర్లలో డయేరియా వ్యాధి తగ్గుమఖం పట్టిందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ఆయన గుర్ల గ్రామంలో శుక్రవారం పర్యటించారు. పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, పైప్లైన్లను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. త్రాగునీరు ఎక్కడా కలుషితం అవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.