భీమసింగిలో అన్నదాన కార్యక్రమం

81చూసినవారు
జామి మండలం భీమసింగిలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీను సిద్ధాంతి అధ్వర్యంలో ఉదయం స్థానిక దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం బారి ఎత్తున అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ నలుమూలల నుండి భక్తులు వచ్చి అమ్మవారు తీర్థ ప్రసాదాలను సేవించారు.

సంబంధిత పోస్ట్